English   

మా బాలయ్య బంగారం.. కాపాడాడు పాప ప్రాణం.. 

 Balakrishna
2020-04-10 16:33:08

బాలయ్యకు కోపం ఎక్కువ అంటారు.. కానీ ఆయనకు ప్రేమ కూడా ఎక్కువే. తన అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు ఈయన. అంతేకాదు తన హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ ను కూడా తన వాళ్ల మాదిరే ట్రీట్ చేస్తాడు బాలయ్య. ఈయన కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అంటున్నారు ఈయన నుంచి సాయం పొందిన వాళ్లు. ఇప్పుడు కూడా ఇలాంటి సాయమే చేసాడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు ఈయన. రెండేళ్ల పాప కాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా తనకు చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ పాప క్యాన్సర్ నుండి కోలుకుంది. డిశ్చార్జ్ కూడా చేసారు వైద్యులు. 

అయితే ప్రస్తుతం బయట లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేదు.. దాంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. తన సొంత కార్ ఇచ్చి వాళ్లను ఊరికి పంపించాడు. ఆ పాప కుటుంబాన్నివాళ్ళ స్వస్థలానికి వెళ్లి దించి రావాలని తన మనుషులకు చెప్పాడు బాలయ్య. దాంతో ఆ కుటుంబం అంతా ఇప్పుడు బాలయ్య మంచి తనానికి నమస్కారం పెడుతున్నారు. అవసరమైన వారికి ఎప్పుడు ఇలాగే సాయం చేస్తుంటాడు మా బాలయ్య అంటూ అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. కరోనా నివారణ కోసం ఈయన ఇప్పటికే 1.25 కోట్ల సాయం కూడా చేసాడు. 

More Related Stories