English   

శ్రీముఖి సినిమాలు ఆయన కారణంగానే మానేసిందంట.. 

Anchor Srimukhi
2020-04-10 16:58:31

'పటాస్' షోతో పాపులర్ అయిన శ్రీముఖి దానికి ముందు కొన్ని సినిమాలు కూడా చేసింది. అన్నింటికంటే మించి బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమెకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్టార్ డమ్ బుల్లితెరపై ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే కెరీర్ మొదట్లో వరస సినిమాలు చేసిన శ్రీముఖి.. తర్వాత మాత్రం ఒక్కసారిగా అన్నింటికీ దూరమైపోయింది. అసలు వెండితెరపై కనిపించడం లేదు. దానికి కారణం కూడా ఇప్పుడు చెప్పుకొచ్చింది ఈమె. 

జులాయి సినిమాలో బన్నీ చెల్లిగా పరిచయం అయింది శ్రీముఖి. ఆ తర్వాత కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, జెంటిల్ మెన్, గుడ్ బ్యాడ్ అగ్లీ, బాబు బాగా బిజీ లాంటి సినిమాలు చేసింది. అయితే విజయాలు ఎక్కువగా రాకపోవడం.. ఈమెకు హీరోయిన్ ఛాన్సులు కూడా లేకపోవడంతో సినిమాల వైపు చూడటం మానేసింది శ్రీముఖి. జులాయి సినిమాలో చేస్తున్నప్పుడే మా నాన్నగారు సినిమాలు చెయ్యొద్దని గట్టిగా చెప్పారు.. ఇదే ఫస్ట్ లాండ్ లాస్ట్ సినిమా అని ఆయన చెప్పారు. అయితే ఒక్కసారి వచ్చిన తర్వాత పురుగు ఊరుకోదు కదా అందుకే తర్వాత కూడా కంటిన్యూ చేసానని చెప్పింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు రావడంతో మూడు సినిమాలు చేసానని.. కానీ ఆ తర్వాత మెల్లగా టీవీ వైపు వచ్చానని చెప్పింది శ్రీముఖి. 

ఆ సమయంలో త్రివిక్రమ్‌ గారు తనకు సినిమాలు చేయాలంటే టీవీకి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారని.. లేదంటే అవకాశాలు రావని చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ఆయన అన్నట్లుగానే సినిమాలు తగ్గిపోయాయని ఆ తర్వాత పూర్తిగా టీవీకే పరిమితం అయిపోయినట్లు చెప్పింది. ఆ తర్వాత కూడా రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్‌లు చేయాలని దర్శక నిర్మాతలు అడగడంతో.. రాం రాం చెప్పినట్లు చెప్పింది శ్రీముఖి.

More Related Stories