English   

రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ చేయబోతున్నారా...

 NTR ram chara
2020-04-10 17:48:41

అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి సూపర్ స్టార్స్ కలిసి నటించిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒకే రేంజ్ ఉన్న హీరోలు కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. మధ్యలో సీతమ్మ వాకిట్లో, గోపాలా గోపాలా లాంటి సినిమాలు వచ్చినా కూడా అవి అసలు సిసలైన మల్టీస్టారర్ సినిమాలు అయితే కావు. అందులో ఒకరు స్టార్ అయితే.. మరొకరు సీనియర్ హీరో. దాంతో ఇఫ్పుడు రాజమౌళి చేస్తున్న RRR కొన్ని దశాబ్ధాల తర్వాత తెలుగులో వస్తున్న అసలైన మల్టీస్టారర్ సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది కూడా. దాంతో తెలుగులో మరిన్ని మల్టీస్టారర్స్ కు ఇది నెలవుగా మారిపోయింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ మరోసారి కలిసి నటించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. 

రాజమౌళి తర్వాత ఆ సాహసం త్రివిక్రమ్ చేయబోతున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఈయన ఓ సినిమా చేయడానికి ఇప్పటికే లైన్ కూడా సిద్ధం చేసుకున్నాడని.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా అయిపోయిన తర్వాత ఈ కథపై కూర్చుంటాడని తెలుస్తుంది. ఆ సినిమా కథ కూడా దాదాపుగా పూర్తైపోయిందనే ప్రచారం అయితే జరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది చరణ్, తారక్ రెండో మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఇద్దరు పెద్ద నిర్మాతలు సంయుక్తంగా నిర్మించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను ఫ్యాక్షన్ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నాడని.. ఇది కూడా అసలైన మల్టీస్టారర్ మజా చూపిస్తుందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా కూడా మరోసారి ఈ మల్టీస్టారర్ వస్తే మాత్రం టాలీవుడ్ రేంజ్ మారిపోయినట్లే. 

More Related Stories