English   

మళ్లీ భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్.. 

 Akshay Kumar
2020-04-10 18:10:36

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలున్నా కూడా ఈయన ముందు దిగదుడుపే. అలా ఉన్నాయి మరి ఈయన చేస్తున్న పనులు ఇప్పుడు. ఒకటి రెండు కాదు ఏకంగా కరోనా బాధితుల కోసం 25 కోట్ల విరాళం ప్రకటించాడు అక్షయ్ కుమార్. అదంతా చూసి అంతా షాక్ అయ్యారు. అది మరిచిపోక ముందే ఇప్పుడు మరో 3 కోట్లు విరాళం అందించాడు ఈయన. కరోనా వైరస్ పై అంతా చేస్తున్న యుద్ధం అద్భుతంగా ఉందని.. ఇంట్లో ఉండటమే దాన్ని అరికట్టడానికి ప్రధాన ఆయుధం అని చెప్పాడు అక్షయ్. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతుగా వారం రోజుల కిందే 25 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు ఈయన. 

ఇప్పుడు ముంబైలోని మున్సిపల్ కార్పోరేషన్ కు మరో 3 కోట్లు ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా అందించిన సూపర్ స్టార్ మరొకరు లేరు. ఈయన సాయాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈయన ప్రశంసించడమే కాకుండా.. 28 కోట్ల రూపాయలను తన వంతుగా ఇచ్చాడు అక్షయ్ కుమార్. ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. ఇది మన మనుషులు ప్రాణాలకు సంబంధించిన సమయం.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇండస్ట్రీకి వచ్చినపుడు తనతో కనీసం 2500 రూపాయలు కూడా లేవని.. ఈ రోజు అనుభవిస్తున్న ఐశ్వర్యం అందించింది జనాలే కాబట్టి మళ్లీ వాళ్లకే ఇస్తున్నానంటున్నాడు ఖిలాడీ. 
 

More Related Stories