చూపించాను కానీ రెచ్చిపోలేదంటున్న ఈషా రెబ్బా..

ఈషా రెబ్బా.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఏడేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పటికీ తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఏదీ సక్సెస్ అయితే ఇవ్వలేదు.. కోరుకున్న గుర్తింపు తీసుకురాలేదు.. విజయం వచ్చినా అది వేరే వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోయింది. అలా కాలం గడిపేస్తున్న ఈషా రెబ్బకు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో నటించింది ఈ బ్యూటీ. కియారా అద్వానీ చేసిన సెన్సేషనల్ రోల్ ఇప్పుడు ఈషా రెబ్బా చేసింది. ఈ పాత్రలో తాను హాట్ అండ్ బోల్డ్ గానే నటించాను కానీ మరీ వల్గర్ గా మాత్రం ఉండదని చెబుతుంది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దీనికి దర్శకుడు. మొన్నటి వరకు కాస్త పద్దతిగానే ఉన్న ఈషా రెబ్బా ఇప్పుడు మాత్రం స్విమ్ సూట్ వరకు వచ్చేసింది. అవసరం అనుకుంటే బికినీకి కూడా సై అనేస్తుంది. ఆ మధ్య స్విమ్మింగ్ పూల్ లో ఫోటో ఇది షేర్ చేసింది ఈ భామ.
ఇప్పుడు మరోసారి ఇలాగే అందాలన్నీ పంచి అభిమానుల్ని పరవశంలో ముంచేస్తుంది ఇషా. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు మాత్రం ఈషా తలుపు తట్టలేదు. అయితే రెండేళ్లుగా ఈ భామ కెరీర్ బాగానే ఉంది. అమీతుమీ.. అ.. సినిమాల్లో నటించింది. అయినా ఇండస్ట్రీలో అందాల ఆరబోతలో కాస్త హద్దులు పెట్టుకుంటే పని జరగదని తెలుసుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్లన్నీ తెంచేసింది. ఆఫర్ల కోసం దేనికైనా సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా నటిస్తున్న రాగల 24 గంటల్లో సినిమాలో నటించింది ఇషా. ఇంకా ఆఫర్లు రావాలంటే అందాలు ఆరబోయక తప్పదని తెలుసుకుని.. ఇలా చిన్న క్యాస్ట్యూమ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ భామ. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్ చూసి అంతా థ్రిల్ అవుతారని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.