English   

బోయపాటి సినిమాలో బాలయ్య బాబే విలన్..

balakrishna
2020-04-10 19:49:16

నిజంగానే ఇది సంచలనం.. ఇన్ని రోజులు బోయపాటి సినిమాలో ఎవరు విలన్ గా నటించబోతున్నారు అనేది ఆసక్తికరంగా చూసారు అభిమానులు. ఒక్కోసారి ఒక్కో పేరు వినిపించింది అయితే ఇప్పుడు మాత్రం మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యే విలన్ గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను సస్పెన్స్ డ్రామాగా బోయపాటి తెరకెక్కించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో బాలయ్య కవలలుగా నటిస్తున్నాడని.. ఒకటి హీరో కారెక్టర్ అయితే.. మరొకరు విలన్ అని ప్రచారం జరుగుతుంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా లెజెండ్, సింహా సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ సినిమాలో ఒకటి విలన్.. మరొకటి హీరో అని.. ఈ రెండు పాత్రలకు మధ్య జరిగే సస్పెన్స్ డ్రామానే సినిమా కథ అంటున్నారు. దీన్ని బోయపాటి తనదైన మాస్ స్టైల్ లో తెరకెకెక్కించబోతున్నారని తెలుస్తోంది. సెకెండాఫ్ లో హీరో ఎవరు.. విలన్ ఎవరు అనేది సస్పెన్స్.. అప్పట్నుంచి సినిమా మరింత రేసీగా ఉండబోతుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారంతా. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది దసరాకు సినిమా విడుదల కానుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు.

 

More Related Stories