English   

అల్లు అర్జున్‌పై నోరు పారేసుకున్న శ్రీ రెడ్డి..

allu
2020-04-11 06:52:32

తెలుగులో మోస్ట్ గెలికింగ్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో ఆలోచన లేకుండా శ్రీ రెడ్డి అని చెప్పాల్సిందే. ఎందుకో తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిపై నోరు పారేసుకుంటూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె చూపులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పడ్డాయి. ఆయన తాజాగా తన పుట్టిన రోజు గిఫ్టుగా అభిమానులకు పుష్ప సినిమా లుక్ విడుదల చేసాడు. దాంతో శ్రీ రెడ్డికి కాలిపోయింది. అంతే తన చేతికి వెంటనే పని చెప్పింది. ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో చచ్చిపోతుంటే.. బర్త్ డ్ గిప్ట్‌లు అని శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యాపారం చేసుకోవటం వెల్లుల్లి అర్జున్‌కు దక్కింది అంటూ కామెంట్ చేసింది. దాంతో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.. దొరికితే చంపేస్తామంటూ మర్యాదగా వార్నింగులు ఇస్తున్నారు.

అంతకుముందు బన్నీ కార్ కొన్నపుడు కూడా ఇలాగే రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఓ వైపు కార్ కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తూనే మరోవైపు సెటైర్లు కూడా వేసింది ఈ బ్యూటీ. బీస్ట్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు బన్నీ తన కార్ కు. కోట్లు పెట్టి కొన్న ఈ కార్ ను ప్రేక్షకులకు కూడా పరిచయం చేసాడు ఈయన. అయితే బన్నీ కార్ కొనడంపై ఇప్పుడు శ్రీ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేసింది. కోట్లు విలువచేసే కారవాన్, రేంజ్ రోవర్ కార్లను కొన్నావు కాని.. కేరళ వరద బాధితులకు ఎంత సాయం చేశావ్.. అక్కడ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా.. నువ్ వాళ్లకు హెల్ప్ చేస్తావని భావిస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పట్ల బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ హీరో ఏం చేస్తున్నాడో తమకు తెలుసు అని.. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటూ శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి మెగా హీరోలను మాత్రం శ్రీ రెడ్డి ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది.

More Related Stories