English   

ఆ కుర్ర దర్శకుడిపై యువీ ప్రేమకు చరణ్ బలవుతున్నాడా..

charan
2020-04-11 07:22:20

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులున్నారు కానీ యూవీ క్రియేషన్స్ మాత్రం సుజీత్ కు కనెక్ట్ అయిపోయింది. ఈయనతో ఇప్పటికే రన్ రాజా రన్ తో పాటు సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసారు. 30 ఏళ్లు కూడా లేని సుజీత్ ను నమ్మి 300 కోట్లు పెట్టి సాహో చేసారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అవడంలో సుజీత్ అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. అందుకే అప్పట్నుంచి మరో నిర్మాత ఈయనకు అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈయనకు ఎలాగైనా మరో సినిమా ఇప్పించాలని యూవీ క్రియేషన్స్ భారీగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ను పట్టుకుంటున్నారు ఆ నిర్మాతలు. యూవీ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ కి రామ్ చరణ్ స్కూల్ ఫ్రెండ్. దాంతో ఇప్పుడు అక్కడ్నుంచి నరుక్కొస్తున్నారని తెలుస్తుంది. ఎలాగైనా కొణిదెల ప్రొడక్షన్ లో సుజిత్ కు సినిమా అవకాశం రప్పించాలని ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే లూసీఫర్ రీమేక్ లిస్టులో సుజీత్ పేరు కూడా చేరిపోయింది.

ఇందులో వంశీ పైడిపల్లి, బాబీ పేర్లు వినిపించినా కూడా ఇప్పుడు సుజీత్ పేరు బలంగా వినిపించడంలో యూవీ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. సుజిత్ కోసం రెండు మూడు మార్గాల నుంచి చరణ్ పై వాళ్లు వత్తిడి తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతుంది. బాబీ వైపు చరణ్ ఆసక్తి చూపిస్తున్నా కూడా సుజీత్ కానీ రేసులో ముందుకొచ్చాడంటే రామ్ చరణ్ మళ్లీ రాంగ్ స్టెప్ వేసినట్లే అని కొందరు ఆయనకు నేరుగానే వార్నింగ్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ లాంటి సబ్జెక్ట్ ను ఈ దర్శకుడు హ్యాండిల్ చేయలేడని కొందరు చెబుతున్న మాట.. దాంతో పాటు చిరంజీవి లాంటి మెగాస్టార్ ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చరణ్ స్టెప్ వేయాలని కోరుకుంటున్నారు అభిమానులు కూడా.

More Related Stories