English   

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్..

heroin
2020-04-11 07:54:01

తెలుగు ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలతో కూడా నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఇలాంటి ముద్దుగుమ్మ కొన్ని రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే లాక్ అయిపోయిందని తెలుస్తుంది. లాక్‌డౌన్ కారణంగా గత 15 రోజులుగా హైదరాబాద్ లోనే తన లవర్ కానీ లవర్ ఇంట్లోనే ఉంటుందని.. ఉండాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే మరొకటి డిజాస్టర్. అయినా కూడా వాళ్ల స్నేహం మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. కేవలం ఆయన కారణంగానే అప్పట్లో తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుందనే వార్తలు కూడా ఆ హీరోయిన్ పై ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే లాక్ డౌన్ కు ముందు జనతా కర్ఫ్యూ టైమ్ లో షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ భామకు ఉన్నట్లుండి సడన్ గా కరోనా ఎఫెక్ట్ తగిలింది.

అప్పటి వరకు ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు రెస్టారెంట్స్, అపార్ట్ మెంట్స్ కూడా మూసేయడంతో అమ్మడికి ఎక్కడికెళ్లాలో అర్థం కాక తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి రెండు రోజుల షెల్టర్ కోసం వచ్చింది. కాస్త ట్రాన్స్ పోర్ట్ వచ్చిన తర్వాత ఎలాగోలా వెళ్దాంలే అనుకుంది. కానీ ఇప్పటికి రెండు వారాలు అయిపోయింది. ఇంకా ఇక్కడే స్టక్ అయిపోయింది ఈ బ్యూటీ. ఈమె విషయంలో మన హీరోగారు కూడా చాలా ప్రయత్నించారు.. ఎలాగోలా తన పర్సనల్ వెహికిల్ ఇచ్చి ఆమెను సొంత రాష్ట్రానికి పంపేద్దామని విఐపి పర్మిషన్ కోసం చూసినా కూడా చుక్కెదురైంది. దాంతో చేసేదేం లేక లాక్ డౌన్ అంతా బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయేలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. అన్నట్లు రోజూ వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేసే ఈ హీరోయిన్ అందుకే కొన్ని రోజులుగా ఎలాంటి జిమ్ వీడియోలు కూడా షేర్ చేయడం లేదు. చేస్తే ఇక్కడే ఉన్నట్లు తెలిసిపోతుంది కదా..

 

More Related Stories