English   

మందడిగిన వర్మ...కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్

Ram Gopal Varma corona
2020-04-11 18:12:06

మామూలుగానే సోషల్ మీడియాలోనే కాపురం చేసే వర్మ. ఇప్పుడు బయటకి కూడా వెళ్ళే  అవకాశం లేకపోవడంతో ఇక పూర్తిగా ట్విట్టర్‌ కి అంకిత‌మై పోయాడు. ఇక ప్రతి రోజు ఏదో ఒక పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుండే వర్మ తాజాగా కేసీఆర్‌, కేటీఆర్‌, వైఎస్ జ‌గ‌న్‌ ల‌ని ట్యాగ్ చేస్తూ మందు కోసం విజ్ఞప్తి చేశాడు. లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం షాపులు అన్నీ మూత‌ప‌డ్డాయని, అది లేక కొంద‌రు ఆత్మహ‌త్య చేసుకుంటున్నారని మ‌రికొంద‌రు పిచ్చోళ్లు అయిపోతు, పిల్లలలా ఏడుస్తు ఫ్రస్ట్రేష‌న్‌ తో పెళ్ళాల‌ని కొడుతుంటే ఇంకొంద‌రు జుట్టు పీక్కుంటున్నారని ఆయన పోస్ట్ చేశారు. అందుజే వెస్ట్  బెంగాల్‌లో మమతా బెనర్జీ చేసినట్లు ఆ మందు ఏదో ఇంటింటికి డెలివరీ చేసే మార్గం చూడండని రిక్వెస్ట్ చేశారు వ‌ర్మ. వ‌ర్మ చేసిన ట్వీట్‌కి కేటీఆర్ త‌న దైన స్టైల్‌లో పంచ్ వేశారు. రాము గారు..  మీరు మాట్లాడేది హెయిర్ క‌టింగ్ గురించే క‌దా, అంటూ కౌంట‌ర్ వేశారు. ఎన్నో సార్లు ట్యాగ్ చేసినా వర్మకి కేటీఆర్ రిప్లై ఇవ్వడం ఇదే మొదటి సారి కాగా వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories