English   

పవన్ వకీల్ సాబ్ మీద శ్రుతి హాసన్ క్లారిటీ 

 Shruti Haasan
2020-04-11 11:30:25

ఇక సినిమాలే చేయను- నా జీవితం ప్రజలకి అంకితం అని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీ ప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయిందనుకోండి. ఆ విషయం పక్కన పెడితే వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం హీరోయిన్ అనన్యలు లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి శృతి హాసన్ అని ప్రచారం జరిగింది.  అయితే ఈ విషయం మీదా తాజాగా శ్రుతి స్పందించింది. 

వకీల్ సాబ్ సినిమాలో నేను చేయడం లేదని, ఈ సినిమాలో పవన్ కి భార్యగా నటిస్తున్నట్టు, త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వకీల్ సాబ్ లో శృతి హాసన్ నటించడం లేదన్న విషయం క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు పవన్ భార్య పాత్రకి ఏ హీరోయిన్ కనబడుతుందో అనే అంశం మళ్ళీ సస్పెన్స్ గా మారింది. కరోనా వలన సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి. అయితే క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ముందు అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌నిర్మాత‌లు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.  

More Related Stories