English   

ఎట్టకేలకి బయటకొచ్చిన విజయ్ దేవరకొండ..మరి నీ లెక్కేది 

vijay dervarakonda
2020-04-11 12:45:30

విజయ్ దేవరకొండ ఎట్టకేలకి బయటకు వచ్చాడు. ఇప్పటికే అందరు హీరోలు తమ తమ బాధ్యతగా కరోనా విరాళాలు ప్రకటిస్తున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ రూపాయి కూడా ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈరోజు మీడియా ముందుకొచ్చాడు విజయ్. అయినా తన తరపున ఎటువంటి సాయం ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉంటున్న హైదరాబాద్ పోలీసులకు ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్ లను తెలంగాణా డాక్టర్స్ ఫెడరేషన్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందచేసింది. 

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ మనస్పూర్తిగా తెలంగాణ పోలీస్ ను అభినందిస్తున్నానని అన్నాడు. 24 గంటలు పోలీసులు మనకోసం పని చేస్తున్నారని, తాను బయటికి వచ్చి 20 రోజులు అయిందని లాక్ డౌన్ ఇంత విజయవంతం అవుతుంది అంటే, అది పోలీస్ , ప్రభుత్వం తో నే సాధ్యం అయ్యిందని అన్నాడు. అలాగే ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండండని కోరాడు. టైమ్ పాస్ కోసం రోడ్ల మీదకు వచ్చి లాక్ డౌన్ బ్రేక్ చేయవద్దని విజయ్ కోరాడు. 

ఇక తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ వారు పోలీస్ లకు ప్రొటెక్షన్ కిట్లు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు విజయ్. ఇక 1450 మంది పోలీస్ సిబ్బంది కి ఫేస్  ప్రొటెక్షన్ షీల్డ్ లను సీపీతో కలిసి విజయ్ దేవరకొండ అందచేశాడు. మరి ఇవి డాక్టర్స్ ఫెడరేషన్ తరపున విజయ్ ఏమైనా స్పాన్సర్ చేశాడా ? అనేది తెలియాల్సి ఉంది.
 

More Related Stories