English   

దిల్ రాజుకి కరోనా కలిసొచ్చింది

Dil Raju
2020-04-11 13:54:00

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుమీదున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి సినిమాలు చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇక ఆయన ఒక దర్శకుడిని పట్టుకున్నాడు అంటే ఆయన చేత రెండు మూడు సినిమాలు చేయకుండా అయితే వదలదు. ఇది వరకు ఆయన మీద జనానికి ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో అది పోతుంది అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే  కరోనా లాక్ డౌన్ వలన టీవీ చూడడం వెబ్  స్ట్రీమింగ్ రెండూ పెరిగాయి. 

లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న ప్రజలంతా టీవీ లేదా డిజిటల్ స్ట్రీమింగ్ వైపె మొగ్గుచూపుతున్నారు. టీవీలో ఎలానూ కొత్త కంటెంట్ రావడానికి ఛాన్స్ లేదు. షూటింగ్స్ నిలిచిపోవడంతో సీరియల్స్, రియాలిటీ షోలు ఏమీ లేవు. వేసిన ఎపిసోడ్స్ వేస్తూ వేసిన సినిమాల్నే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే దిల్ రాజు తెలివిగా వ్యవహరించి డబ్బు చేసుకున్నాడు. లాక్ డౌన్ వేళ తన వద్ద ఉన్న పాత సరుకు మొత్తాన్ని అమెజాన్ కి మంచి రేటుకు అమ్మేశాడు. ఆయా సినిమాల శాటిలైట్ రైట్స్ వేరే వాళ్లకు ఉన్నా వాళ్ళను మేనేజ్ చేసి మరీ అమెజాన్ ప్రైమ్ తో బిజినెస్ కుదుర్చుకుని మంచిగా వెనకేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
 

More Related Stories