మొన్న హ్యాకింగ్ నిన్న మార్ఫింగ్..పాపం అనుపమ

సోషల్ మీడియా అంటేనే ఒక రచ్చ. ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు ఎదవలు ఉంటారు. మంచి వాళ్ళు తగిలితే పర్లేదు కానీ ఎదద్వాలు తగిలితేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే టెక్నాలజీ తెలిసిన కొందరు హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అంతేకాక మార్ఫింగ్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం చేసి రచ్చ చేస్తుంటారు. హీరోయిన్స్ అంటేనే ఒక రకమైన చీప్ భావాలు కలిగిన వాళ్ళంతా ఆ ఫోటోలు నిజమేనని ఆ హీరోయిన్ నిజంగానే అసభ్యంగా ఉన్న ఫోటోలు దిగిందని ఫిక్స్ అయిపోతారు.
తాజాగా తన ఫేస్ బుక్ ని ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఘాటుగానే స్పందించింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో తన ఒరిజినల్, మార్ఫింగ్ ఫోటోలని షేర్ చేస్తూ .. ఈ చెత్త పని చేయడానికి చాలా సమయం పట్టినట్లుంది. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా? అంటూ వారిని సూటిగానే ప్రశ్నించింది.
ఆమె సోషల్ మీడియా అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసారని దయచేసి దాని నుంచి వచ్చే పోస్టులు ఎవరు నమ్మవద్దని అను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఆ తరువాత ఇలాంటి ఫోటోలు రావడం గమనార్హం. ఇక తెలుగులో రాక్షసుడు తర్వాత మరో సినిమా చేయలేదు అనుపమ. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో రెండు మూడు సినిమాలు చర్చల్ దశలో ఉన్నాయి.