English   

విజయ్ మాస్టర్ ను లాక్ డౌన్ ఏమీ చేయలేదట 

Vijay Master
2020-04-11 16:09:12

ఒకప్పుడు తెలుగులో తమిళ సినిమాలు పెద్ద రిలీజయ్యేవి కాదు. కానీ ఇప్పుడు కనీసం ఐదారుగురు హీరోల సినిమాలు డైరెక్ట్ రిలీజ్ లు అవుతున్నాయి. వాళ్ళలో ఒకటు ఇలయతలపతి విజయ్. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో హిట్ కోసం కష్ట పడుతుంటే విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు తెలుగులో అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన సూర్యతో ఖైదీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తో మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ లాక్ డౌన్ యవ్వారం లేకుంటే ఎప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

అయితే ఇలాంటి సమయంలో మాస్టర్ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో విజయ్ ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు డిజైన్ చేసారు. దాంతో పాటు మాస్టర్‌ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు త్వరలో మాస్టర్‌ ను మీరు చూస్తారంటూ రాసుకొచ్చారు. అయితే త్వరలో మాస్టర్ ను మీరు చూస్తారని రాసి ఉండడం చూస్తే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా.. విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్‌గా నటించారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ క్రియేషన్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. త్వరలో అన్నారు కానీ.. డేట్ మాత్రం చెప్పలేదు..చూద్దాం

More Related Stories