English   

చిరంజీవి సాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ సక్సెస్.. 

chiranjeevi
2020-04-11 16:21:52

చిరంజీవి గారి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎమ్. గోపీచంద్ ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది. స‌ర్జ‌రీ విజయవంతం అయ్యిందని తెలిపాడు చిరు అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు. ఈ రోజు అందరి ప్రార్థనలు ఫలించి.. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్ గా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని చెప్పాడు స్వామి.

ఆపరేషన్ గురించి మెగాస్టార్ శ్రీ చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారని.. ఆపరేషన్ పూర్తవ్వగానే మొదటి ఫోన్ డాక్ట‌ర్.. గోపీచంద్ మెగాస్టార్ చిరంజీవికి తెలియజేసారని.. చిరంజీవి చాలా సంతోషంతో ఆప‌రేష‌న్ విజయవంతం అయ్యిందని మా అందరికి తెలియజేసారని చెప్పాడు. 

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్ట‌ర్ గోపీచంద్ గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాని` అన్నారు.

More Related Stories