English   

వి సినిమాకి ఆమెజాన్ భారీ ఆఫర్..అయినా వద్దన్న దిల్ రాజు..

nani v Movie
2020-04-11 16:29:35

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ వి. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద తెరక్కుతున్న ఈ సినిమాకి తీసేవి తక్కువ సినిమాలే అయినా విభిన్న చిత్రాలను  తెరకెక్కిస్స్తారన్న  పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు.."రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు..."రక్షకుడు" వస్తున్నాడు అంటూ ఆ మధ్య సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నాని లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు లుక్స్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అయితే నాని ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నాడని ముందు నుండీ చెబుతున్నారు. 

ఆల్లాంటి పాత్ర నాని చేయడం ఇదే మొదటిసారి. ఒకరకంగా ఈ సినిమా మీద భారీ అంచనలున్నాయి. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.  అయితే కరోనా లాక్ డౌన్ వలన ఆగిపోయింది. అయితే ఈ సినిమా కోసం ఆమేజాన్ ప్రైమ్ వాళ్లు దిల్ రాజుకు మంచి రేట్ అఫర్ చేశారట.. ఈ సినిమా థియేటర్ లో కాకుండా మొత్తానికి తమకి ఇచ్చేస్తే తాము 40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే అమౌంట్ టెంప్ట్ చేసేలా ఉన్నా ఇప్పుడు సినిమా అమ్మేస్తే తన థియేటర్స్ బిజినెస్ ఇబ్బందుల్లోకి వెళ్తుందనీ భావించి నో చెప్పినట్టు సమాచారం. అంటే ఒక రకంగా ఒక బిజినెస్ పోగొట్టుకోవడం ఇష్టం లేక దిల్ రాజు ఆ ఆఫర్ ను ఒప్పుకోలేదని చెబుతున్నారు.

More Related Stories