English   

పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టిన రష్మిక.. 

 Rashmika mandanna
2020-04-11 17:52:42

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులోనే కాదు సౌత్ లోనే హాట్ హీరోయిన్. ఈమె గురించి ప్రతీ విషయం కూడా సంచలనమే. తాజాగా ఈమె పెళ్లి గురించి మరోసారి ఓపెన్ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించడమే కాకుండా అందులో రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా బాగానే పేలింది. దానికి తోడు డాన్స్ లో కూడా సత్తా చూపించింది రష్మిక. దాంతో పాటే నితిన్ హీరోగా నటించిన భీష్మ కూడా విజయం సాధించే సరికి అమ్మడు గాల్లో తేలిపోతుంది. ప్రస్తుతం అభిమానులతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ భామ.. పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది రష్మిక మందన్న. దానికి వెంటనే సమాధానం కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతానికి సినిమాలు తప్ప పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కన్ఫర్మ్ చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అలాంటిదేమీ లేదు.. తన ఓటు అరేంజ్డ్ మ్యారేజ్ కే అనేసింది. ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదా అంటే నో కామెంట్స్ అనేసింది ఈ భామ. రెండేళ్ల కింద కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకుంది రష్మిక. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసింది. మళ్లీ ఇప్పుడు పెళ్లి గురించి టాపిక్ వచ్చేసరికి మనసులో మాట బయటపెట్టింది రష్మిక మందన్న. మరో 8 ఏళ్ల తర్వాత కాని తాను పెళ్లి చేసుకోను అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అప్పటి వరకు ఇలాగే సినిమాలతో బిజీగా ఉంటానని నమ్మకంగా చెబుతోంది రష్మిక. బన్నీ పుష్ప సినిమాతో పాటు తెలుగులో మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ కస్తూరి.

More Related Stories