కరణ్ జోహార్ బ్యూటీ చాలా చాలా హాట్ బాబోయ్..

కరణ్ జోహార్.. పేరుకు బాలీవుడ్ దర్శకుడు కానీ ఈయన పేరు తెలుగు ఇండస్ట్రీలో కూడా పాపులరే. బాహుబలి సినిమాను బాలీవుడ్ విడుదల చేసాడంటూ ఇక్కడ కూడా ఈయన్ని బాగానే గుర్తు పెట్టుకున్నారు మన ప్రేక్షకులు. ఈయనకు మరోలా కూడా ఇమేజ్ ఉంది. అదే బాలీవుడ్ కు కొత్త హీరోయిన్లను బాగా పరిచయం చేస్తాడని. మన దగ్గర కానీ సినిమాకో కొత్త బ్యూటీని తీసుకొచ్చినట్లు.. కరణ్ జోహార్ కూడా అదే చేస్తాడు. ఈయన రెండేళ్ల కింద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా కోసం ఇద్దరు బ్యూటీస్ ను తీసుకొచ్చాడు. ఐదేళ్ల కిందే వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు ఇది సీక్వెల్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తోనే అలియా భట్, సిద్ధార్థ్ మల్హాత్ర, వరుణ్ ధావన్ లను పరిచయం చేసాడు కరణ్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో అనన్యా పాండేతో పాటు తారా సతారియాను హీరోయిన్లుగా పరిచయం చేసాడు కరణ్. ఇప్పటికే అనన్య స్టార్ హీరోయిన్ అయ్యేందుకు దూసుకుపోతుంది. హాట్ షోతో మతులు చెడగొడుతుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక తారా సుతారియా కూడా సుతారంగా రెచ్చిపోతుంది. ఇప్పుడు విడుదలైన ఫోటోషూట్ లో కూడా బికినీ షోతో మతులు చెడగొట్టేసింది తార. మొత్తానికి కరణ్ జోహార్ పేరు నిలబెడుతూ తారా కూడా త్వరలోనే స్టార్ తార అయ్యేలా కనిపిస్తుంది.