English   

ఆమె మా అమ్మ కాదు...అయినా మా అమ్మే : చిరంజీవి

chiru
2020-04-11 20:53:20

రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతం అవుతున్న క్రమంలో ఇప్పటికే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి భారీ విరాళాలు ఇస్తుండగా ఎవరి తగ్గట్టు వారు సాయం చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తనకు చేతనైనంతలో సాయం చేసినట్టు ప్రచారం జరిగింది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన అంజనా దేవి, 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారు.

తన వయసును, వృద్ధాప్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె ఇలా చేశారని పలువురు అభినందిస్తున్నారు. ఇక ఈ వార్తలపై మెగాస్టార్ చిరు స్పందించి ఆ వార్త నిజం కాదని ట్వీట్ చేశారు. ఆమె తన తల్లి కాదని క్లారిటీ ఇచ్చారు. .”మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..” అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

 

More Related Stories