English   

మా అసోసియేషన్ పై నిప్పులు చెరిగిన మోహన్ బాబు..

mohn
2020-04-12 07:30:38

తెలుగు ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ఎప్పుడూ భాగంగానే ఉంటుంది. అందులో కొన్ని వందల మంది ఉంటారు. సభ్యులు కూడా చాలా మంది ఉంటారు. అన్నింటికి మించి మా అసోసియేషన్ ఎన్నికలు గత కొంతకాలంగా వివాదాస్పదం అవుతున్నాయి. నిజమైన రాజకీయాలను తలపిస్తున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వాళ్ళు యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఇవ్వగలను సద్దుమణిగేలా చేస్తున్నారు. గత ఏడాది కూడా మా అసోసియేషన్ డైరీ లాంచ్ వేడుకలో రాజశేఖర్ మాట్లాడిన మాటలకు చిరంజీవి, మోహన్ బాబు చాలా హర్ట్ అయ్యారు. అక్కడి నుంచి మోహన్ బాబు ఇండస్ట్రీ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నాడు ఈయన.

అంతేకాదు ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో మా అసోసియేషన్ పై నిప్పులు చెరిగారు కలెక్షన్ కింగ్. లేనిపోని తలనొప్పులు అంటించుకోవడం ఇష్టం లేక మా అసోసియేషన్ జోలికి వెళ్లడం లేదని చెప్పాడు. అందులో తాను చూడని పదవి ఏమీ లేదని.. ఇంతకు ముందే తాను అధ్యక్షుడిగా చేశానాని.. ఇప్పుడు కొత్తగా అక్కడ నేను వెళ్లి చేసేదేం లేదు అంటున్నాడు మోహన్ బాబు. అంతేకాదు అక్కడ జరిగే చిల్లర గొడవలకు తనను పిలవద్దని చిరంజీవికి.. మిగిలిన సభ్యులకు కూడా స్పష్టంగా చెప్పినట్లు చెప్పాడు కలెక్షన్ కింగ్. మా అసోసియేషన్ ఇంతకుముందులా లేదని.. పరువు తీసే మనుషులు కూడా చాలామంది తయారయ్యారు అంటున్నాడు మోహన్ బాబు.

More Related Stories