English   

నేనూ ఈ అందమైన కుటంబంలో ఒకడినే...కొరటాల సాయం

siva
2020-04-12 07:40:34

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న పేద సంఘటిత కార్మికుల‌ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీకి హీరోలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. అయితే అలా ఇవ్వడం ఇష్టం లేని కొందరు తామే నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ని కొని వారికి పంచుతున్నారు. ఇక సిసిసి తరపున ద‌ర్శక‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ – ద‌ర్శకుల సంఘం అధ్యక్షుడు శంక‌ర్ ల టీం కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ కూడా మొదలు పెట్టారు.

కొద్ది రోజుల నుండీ ఈ పంపిణీ మొదలయింది. సినిమాలోని 24 శాఖ‌ల కార్మికుల్లో రెక్కాడితే కానీ డొక్కాడని వారికి అందరికీ ఈ స‌రుకుల్ని పంపిణీ చేస్తున్నారు. శంకర్ స్వయంగా సినీ ప‌రిశ్రమ‌లో యూనియన్ లకి చెందిన ప్రతి కార్మికుడి ఇంటికి వెళ్లి వారికి నెల‌కు స‌రిప‌డా బియ్యం, ప‌ప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర సరుకుల‌ని అందిస్తున్నారు. తాజాగా ఈ ఛారిటీకి దర్శకుడు కొరటాల శివ రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. ‘‘సినీ పరిశ్రమలోని రోజూవారి కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు రూ. 5 లక్షలను విరాళంగా ఇస్తున్నాను. నేను కూడా ఈ అందమైన ఫ్యామిలీ ఒకడిని. అందరం కలిసి ఈ మహమ్మారిపై పోరాడదాం. సాయం కాదిది. తోడు..’’ అని కొరటాల శివ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

More Related Stories