English   

నాగ్ అశ్విన్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఆ దర్శకుడితో..

prabhas
2020-04-12 08:41:14

ప్రభాస్ తో సినిమా అంటే ఇది వరకు తెలుగు మార్కెట్ మాత్రం చూసుకుంటే సరిపోయేది. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథ సిద్ధం చేసుకుంటే సినిమా రెడీ అయిపోయేది. కానీ బాహుబలి తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రభాస్ కోసం ఇప్పుడు తెలుగు కథలు కాదు పాన్ ఇండియా కథలు కావాలి. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అయింది. దీన్ని బట్టి ప్రభాస్ మార్కెట్ అర్థమవుతుంది.  సాహో హిందీలో తొలిరోజు 25 కోట్లకు పైగా వసూలు చేసింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు హిందీలో ప్రభాస్ మార్కెట్ ఎంత పెరిగిపోయిందో. అందుకే తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రెబల్ స్టార్. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన దీని తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. టైం మిషన్ కథ నేపథ్యంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది.

దీని బడ్జెట్ దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ఉండబోతుంది. ఇలాంటి కథను తెలుగు ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ తప్ప మరొకరు మోయలేరని చెప్పాడు ఈ దర్శకుడు. ఇక నాగ్ అశ్విన్ తర్వాత ఈయన మరోసారి ఒక సంచలన దర్శకుడితో జతకట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కే జి ఎఫ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి ప్రశాంత్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు ఈయనతో పని చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది. మొత్తానికి అన్నీ కుదిరి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా వర్కౌట్ ఐతే మాత్రం మరో బాహుబలి కావడం ఖాయం అంటున్నారు అభిమానులు.

More Related Stories