English   

వారసత్వంపై సంచలన కామెంట్స్ చేసిన మోహన్ బాబు..

mohanbabu
2020-04-12 09:31:25

ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. ఎక్కడ చూసినా వారసులదే రాజ్యం.. ప్రతి చోట వాళ్లే కనిపిస్తున్నారు. నూటికి ఎనభై శాతం వారసుల రాజ్యంగా మారిపోయింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ. తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇండస్ట్రీ ఏది తీసుకున్నా కూడా అన్ని చోట్ల వారసుల రాజ్యం నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో అది మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ బయట నుంచి వచ్చిన హీరోలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు మినహాయిస్తే గత 20 ఏళ్లలో తెలుగు ఇండస్ట్రీలో సొంతంగా వచ్చి స్టార్ అయిన హీరో మరొకరు లేరు. అంత బలంగా పాతుకుపోయారు ఇక్కడ వారసులు. ఇలాంటి వారసత్వంపై ఇప్పుడు మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో మెగా హీరోలను.. వాళ్ళ కుటుంబాన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది..

ఎప్పుడైనా ఈర్ష పడ్డార అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు కూడా సంచలన సమాధానం చెప్పాడు. వారసత్వం అనే పదమే తనకు నచ్చదని.. ఇక్కడ ఎవరూ ఎవరికీ వారసుడు కాదు అని చెప్పాడు ఈయన. విషయం ఉన్న వాడు నిలబడతాడు అంతే అంటున్నాడు మోహన్ బాబు. వారసత్వం అనేది ఉండదని.. మనోజ్, విష్ణు, లక్ష్మి ఇక్కడ పుట్టాలని రాసి పెట్టుంది.. పుట్టారు అంతే.. దానికి వారసులు వారసత్వం అని పేరు పెట్టొద్దు అంటున్నాడు మోహన్ బాబు. తన పిల్లల విషయానికి వస్తే మనోజ్ కి సినిమాలంటే ఇష్టమని.. విష్ణు మాత్రం బిజినెస్ పై దృష్టి పెడుతున్నాడు అని చెప్పాడు కలెక్షన్ కింగ్. మొత్తానికి వారసత్వం అంటే తనకు పడదని.. మెగా కుటుంబాన్ని చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ ఉండదని చెప్పాడు. చిరంజీవి కూడా తనకు ఆత్మీయుడు అని.. ఇద్దరం మంచి స్నేహితులం అని మరోసారి చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.

More Related Stories