English   

పాపం స్లాట్స్ ఇన్ పోలేక చచ్చిపోతున్న టీవీ చానల్స్..

tv
2020-04-12 10:21:19

ఏ మాత్రం కరుణ లేని కరోనా వైరస్ ఇండియాను నిర్ధాక్షణ్యంగా నాశనం చేస్తుంది. దీని వల్ల అన్ని ఇండస్ట్రీలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వేల కోట్ల నష్టాలను చవి చూస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అయితే గత నెల రోజులుగా పూర్తిగా ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. గత 4 శుక్రవారాలు నుంచి ఎలాంటి సినిమాలు లేవు.. దానికితోడు రాబోయే నెల రోజులు కూడా థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలు కనిపించడం లేదు. దాంతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీ కూడా దారుణంగా నష్టపోతుంది. సినిమాలు లేకపోతే హాయిగా టీవీ చూసుకోవచ్చు అనుకునే వాళ్లకు ఇప్పుడు అది కూడా షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. షూటింగ్స్ అన్ని పూర్తిగా ఆపేయాలని ఆర్డర్స్ రావడం.. దానికి తోడు లాక్ డౌన్ కూడా కావడంతో సీరియల్ యాక్టర్స్ కూడా అంతా ఇంటికి పరిమితం అయిపోయారు. ఈ వైరస్ కారణంగా భయపడే వాళ్ళు కూడా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. దాంతో సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.

రియాలిటీ షోలు మ్యూజికల్ షోలు ఇలా అన్నీ షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో టెలివిజన్ లో స్లాట్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు యాజమాన్యం. ఇప్పటి వరకు కొన్ని పాత సినిమాలు, కొత్త సినిమాలు, రియాలిటీ షో లు అన్ని రిపీట్ చేస్తున్నారు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా భారీ నష్టాల్లో కూరుకుపోతాం అంటున్నారు వాళ్ళు. అందులో కొన్ని సీరియల్స్ వారం వారం షూటింగ్ చేసుకునేవి ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షో లు నెలలో 8 ఎపిసోడ్ పూర్తి చేస్తారు. దానికి నాలుగు రోజులు కాల్షీట్లు అవసరం ఉంటాయి. అయితే ఇప్పుడు వాటికి కూడా ఆగిపోయాయి. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీపై కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. దీని దెబ్బకు సినిమాలు టెలివిజన్ దారుణంగా నష్టపోతున్నాయి. మళ్లీ ఈ పరిస్థితి ఎప్పటికీ బాగుపడుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 

More Related Stories