English   

సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ బ్రతుకులు మరీ ఘోరం..

cinema
2020-04-12 11:18:00

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారి సినిమా కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. హీరోలు నిర్మాతలు ఎంత ముందుకు వచ్చి సాయం చేసినా కూడా అందరికీ ఇది అందడం లేదు. ఎన్నో వేల కుటుంబాలు సినిమా ఇండస్ట్రీపై బతుకుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అకారణంగా నష్టపోతున్నది జూనియర్ ఆర్టిస్టులు.. 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్లు.. రోజువారి సినీ కార్మికులు.. వాళ్లకు రోజు పని చేసుకుంటే కానీ పూట గడవదు. అలాంటి వాళ్ళు గత నెల రోజులుగా ఎలాంటి పని లేకుండా ఉన్నారు. మరో నెల రోజుల వరకు సినిమా షూటింగ్స్ అన్ని నిలిపేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. దాంతో వాళ్ళ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఒక సినిమా షూటింగ్ జరిగితే తప్ప జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు రావు. ఈ సినిమాను నమ్ముకొని థియేటర్లలో పార్కింగ్.. లోపల సమోసాలు అమ్ముకునే వాడు.. క్యాంటీన్ ఓనర్.. చివరికి ఛాయ్ అమ్ముకునే వాడు కూడా బతుకుతుంటాడు.

వాళ్ళందరికీ ఒక్కముక్కలో చెప్పాలంటే సినిమా జీవనాధారం. ఒక్కరోజు సినిమా ఆగిపోయినా కూడా వాళ్ల బతుకు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఆపేశారు. దాంతో వాళ్ల బతుకులు కూడా అక్కడే ఆగిపోయాయి. ఆర్థికంగా వాళ్లు మరింత చితికిపోతున్నారు. ఇది ఎవరు కావాలని చేయకపోయినా కూడా సినిమా కార్మికుల జీవితాలపై మాత్రం కరోనా వైరస్ దారుణంగా దెబ్బ కొడుతుంది. వీళ్ళని ఆదుకోవడానికి ఫిలిం ఛాంబర్ ముందుకు వచ్చినా కూడా అందులో కొంత మంది దగ్గర మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ కార్డులు ఉంటాయి. ఇక థియేటర్ లో పని చేసుకునే వాళ్ళ జీవితాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఇలా ఒక్క సినిమాతో చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. దాంతో ఈ మహమ్మారి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన దేశం నుంచి పారద్రోలాలని అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

More Related Stories