English   

మహాసముద్రంలో సాయి పల్లవి

sai
2020-04-12 11:25:55

‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి. అంత హిట్ కొట్టినా రెండో సినిమాని పట్టాలెక్కించడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని, ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అలా రవితేజ మొదలు నాగచైతన్య దాకా అనేక మంది హీరోల చేతులు మారిన కధ శర్వానంద్‌ వద్దకు చేరి ఓకె అయింది. ఈ సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 కార్తికేయ నటించవచ్చని అంటున్నా దాని మీద క్లారిటీ లేదు. అయితే శర్వా జోడీగా సమంతను అనుకున్నా ఆమె చేయనని చెప్పడంతో ఆ పాత్రకు సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ కధ నేరేషన్ పూర్తవ సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు. ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని కరోనా సద్దుమణిగాక జూన్ లో ప్రారంభించవచ్చని అంటున్నారు.  

 

More Related Stories