English   

మద్దాలి శివారెడ్డి ఇచ్చిన విరాళం తెలిస్తే దండేసి దండం పెడతారు..

ravikiran
2020-04-12 16:20:20

నిజంగానే ఇప్పుడు ఇదే పని చేస్తారు.. ఒకటి రెండు కాదు మన మద్దాలి శివారెడ్డి అదేనండి రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ గుర్తున్నాడు కదా.. ఆయన ఇచ్చిన విరాళం తెలిస్తే చేతులెత్తి దండాలయ్యా అని పాట పాడతారేమో..? అంతగా ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రేసుగుర్రంలో డర్టీ పొలిటీషియన్ గా నటించాడు కానీ నిజ జీవితంలో మాత్రం ఈయన మంచి రాజకీయ నాయకుడు.. ప్రజల కోసం పాటుపడే రాజకీయ నాయకుడు. ఈయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు.. భోజ్ పురీ సూపర్ స్టార్ అయిన రవి కిషన్ అక్కడి ప్రజలకు ఏ కష్టమొచ్చినా కూడా ముందుంటాడు. ఇప్పుడు కూడా కరోనా వైరస్ పై పోరాటానికి తనకు ఎంపీగా వచ్చే ఐదేళ్ల జీతాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేసాడు. ఏకంగా ఐదు సంవత్సరాల జీతం అంటే చిన్న విషయం కాదు.. కానీ అది ప్రజల కష్టం ముందు చిన్నదే అంటున్నాడు ఈయన. అందుకే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు రవి కిషన్. ఈయన నిర్ణయం చూసి అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వాళ్లంతా కూడా వెల్ సెటిల్డ్.. వాళ్లు కూడా ఎంపిగా వచ్చే జీతంలో కొంత భాగం ఇలా విరాళంగా ఇస్తే చాలా మేలు అవుతుందంటున్నారు విశ్లేషకులు. జీతాలు చాలా మంది ఇస్తుంటారు కానీ ఒకేసారి ఐదేళ్ల జీతం మాత్రం ఇవ్వడం నిజంగానే సంచలనం.. రవి కిషన్ చేసిన పనిపై విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Related Stories