పవన్ కళ్యాణ్ సినిమాలో మళ్లీ ఆమె హీరోయిన్..

పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి పూర్తయ్యే లోపు మరోటి రెడీ చేస్తున్నాడు. మధ్యలో కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం ఈ పాటికే పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ అన్నీ వచ్చేసేవి. మే 15న అది విడుదలయ్యేది కూడా. అయితే ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. కరోనా వేడి చల్లారిన తర్వాత మెల్లిగా ఒక్కో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈయన. ప్రస్తుతం వకీల్ సాబ్, క్రిష్ సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడు ఈయన. అన్నా మా పవన్ సినిమా ఎలా ఉండబోతుంది..? మీరు కచ్చితంగా ఈ సారి కూడా గబ్బర్ సింగ్ కంటే పెద్ద సినిమా ఇవ్వాలన్నా అంటూ హరీష్ శంకర్ ను అడుగుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ల ఆకలి ఈ దర్శకుడికి బాగా తెలుసు.
అప్పట్లో పవన్ పన్నెండేళ్ళ ఆశలకు తెర దించిన దర్శకుడు ఈయన. గబ్బర్ సింగ్ తో రికార్డులు తిరగరాసిన దర్శకుడు. కానీ ఆ తర్వాతే ఈయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్.. సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్టైనా అది పెద్ద హీరో సినిమా కాదు. ఆ తర్వాత డిజే, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో పర్లేదనిపించాడు ఈ దర్శకుడు. ఇదంతా ఇలా ఉంటే.. కొన్ని రోజులుగా ఈయన పవన్ కోసం ఈయన ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ సారి వచ్చే సినిమా మాస్ కా బాప్ లా ఉంటుందని.. గబ్బర్ సింగ్ ను కూడా మరిపించేలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను అనుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఫ్యాన్స్ మాత్రం వద్దంటున్నారు. సర్దార్ లో ఈమె నటించింది.. ఆ సినిమా ప్లాప్ అయింది కదా ఆ కాంబినేషన్ వద్దంటున్నారు. కానీ పవన్ మాత్రం కాజల్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే ఒకేసారి అన్నాదమ్ములతో కాజల్ రొమాన్స్ చేస్తున్నట్లే.