English   

బాలయ్య కెరీర్‌కు ఇప్పుడు అతడు తప్ప ఆప్షన్ లేదా..

nbk
2020-04-12 17:20:55

ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. రూలర్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో బాలయ్య ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో బాలయ్యను కాపాడేది ఒకేఒక్కడు.. అతడే బోయపాటి శ్రీను. అయినా బాల‌య్య‌కు కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో భ‌లే సింక్ అవుతుంది. వాళ్ల కాంబినేష‌న్ ఎప్పుడు వ‌చ్చినా కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. ఒక‌ప్పుడు కోడి రామ‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత బి గోపాల్ తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసాడు బాల‌య్య‌. ఓ ర‌కంగా ఆయ‌న కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన ద‌ర్శ‌కులు వాళ్లే. ఆ రేంజ్ లో బాల‌య్య‌తో మాయ చేస్తున్న ఈ తరం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. మిగిలిన ద‌ర్శ‌కులంతా ఫ్లాపులిస్తున్న స‌మ‌యంలో సింహా సినిమా చేసి బాల‌య్య కెరీర్ కు ఊపిరి ఊదాడు బోయ‌పాటి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు బోయ‌పాటి శీను. వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో బోయ‌పాటికి పది నెలల గ్యాప్ వచ్చింది.

మరో సినిమాను మొదలు పెట్టడానికి చాలా టైమ్ తీసుకున్నాడు ఈ దర్శకుడు.ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.ఇది కూడా ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉండ‌బోతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే కరోనా రావడంతో నిలిపేసారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు బాలయ్య సహ నిర్మాతగా ఉన్నాడని తెలుస్తుంది. దీనికోసం రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్‌లో షేర్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కూడా సింహా, లెజెండ్ సినిమాల్లో మాదిరే ఇప్పుడు కూడా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. ఇందులో ఒకటి విలన్ అయితే.. మరోటి హీరో అని తెలుస్తుంది. కవలల మధ్య జరిగే సస్పెన్స్ డ్రామా ఇది అని ప్రచారం జరుగుతుంది. విలన్ పాత్ర ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందన్నదే చివర్లో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బాలయ్య, బోయపాటి సినిమాలో ఎమోషన్‌, సెంటిమెంట్, యాక్షన్ అంతా హైలెట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. 2020 దసరా విడుదలకు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

 

More Related Stories