English   

కేటీఆర్ పంచ్ కు వ‌ర్మ ముక్కు ప‌చ్చ‌డైందంట‌..

rgv
2020-04-13 06:56:09

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కాదు కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కూడా ఇప్పుడు తను వాడేసుకుంటున్నాడు. దీని విజృంభన చూసి అంతా వ‌ణికిపోతుంటే ఈయ‌న మాత్రం హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా వ‌ర్మ చేస్తున్న కొన్ని ట్వీట్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈయ‌న‌కు పిచ్చి గానీ ప‌ట్టిందా ఏంటి అని అడుగుతున్నారు. మొన్న‌టికి మొన్న మందు బాబుల కోసం వ‌కాల్తా తీసుకుని ఓ ట్వీట్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది చూసిన కేటీఆర్ సూప‌ర్ పంచ్ ఇచ్చాడు. మందు లేక చ‌చ్చిపోతున్నారు.. పెళ్లాల‌ను కొడుతున్నారు.. హోమ్ డెలివ‌రీ అయినా పెట్టాల‌ని కేసీఆర్, జ‌గ‌న్ ల‌ను తాను కోరుతున్న‌ట్లు చేసిన ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. రాము గారు మీరు మాట్లాడితే హెయిర్ క‌ట్టింగ్ గురించే క‌దా అంటూ సెటైర్ వేసాడు. ఎందుకో కానీ రెండు రోజులుగా దీనికి రిప్లై ఇవ్వ‌ని వ‌ర్మ‌.. ఇప్పుడు చూసుకుని త‌న రిప్లై ఇచ్చాడు. కేటీఆర్ గారూ మీ హ్యూమ‌ర్ కు నా జోహార్.. మీరు వేసిన బాక్సింగ్ పంచ్ తో నా ముక్కు ప‌చ్చ‌డైపోయింది.. అయినా కూడా మీ ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు చూస్తుంటే ముచ్చ‌టేస్తుందంటూ ట్వీట్ చేసాడు. మీ ట్వీట్ ఎందుకో నేను రెండు రోజులుగా మిస్ అయ్యాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

More Related Stories