సోనమ్ కపూర్ కు క్లాస్ పీకిన జబర్దస్త్ యాంకర్ రష్మి..

జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్. హీరోయిన్లను మించే గ్లామర్ షో చేస్తూ వాళ్ల కంటే ఎక్కువగా ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న సినిమాలే చేసినా కూడా కేవలం తనపై మాత్రమే నడిచే సినిమాలు చేస్తుంటుంది రష్మి. సినిమాల సంగతి పక్కనబెడితే బుల్లితెరపై ఎప్పుడూ సూపర్ పాపులర్ రష్మి. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ విషయాన్ని అక్కడ పోస్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు మరింత బిజీ అయిపోయిందక్కడ. కరోనా మొదలైన తర్వాత అందరికీ సాయం చేయండి.. ముఖ్యంగా మూగ జీవాలను పట్టించుకోండి అంటూ ఆమె చేస్తున్న ట్వీట్స్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంది రష్మి గౌతమ్. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే చాక్ లెట్ కేక్ సిద్దం చేసుకుంది సోనమ్ కపూర్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందులో చాక్ లెట్ లేని సమయంలో తనకు ఫార్చ్యూన్ గార్మెట్స్ ఇండియా సంస్థ వాళ్ళు తన మనుషులతో చాక్ లెట్ పంపించారని చెప్పింది. ఇది చూసి రష్మి గౌతమ్ కు బాగా మండిపోయింది. మీ హోదాను చాక్లెట్ కోసం వినియోగించుకోవడం విడ్డూరంగా ఉందని.. ఫార్చ్యూన్ గార్మెట్ ఇండియా సంస్థను చాక్లెట్ అడిగి తెప్పించుకోవడం మీ హోదాను ప్రదర్శించడమే అవుతుందని.. ఈ విపత్తు సమయంలో అలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేసింది రష్మి గౌతమ్. అంతేకాదు.. మీ అవసరం కోసం ఉద్యోగుల ఆరోగ్యాలను కూడా మీరు ఇబ్బందుల్లో పడేస్తున్నారంటూ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తీరుపై రష్మి ఫైర్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.