English   

విన‌య విధేయ రామ సినిమా ఫ్లాప్ కు అదే కార‌ణమా..

vinay
2020-04-13 08:08:24

రంగ‌స్థ‌లం లాంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమా విన‌య విధేయ రామ‌. బోయ‌పాటి శ్రీను లాంటి మాస్ డైరెక్ట‌ర్ తో తొలి కాంబినేష‌న్ కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా విడుద‌ల‌కు ముందు పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ కూడా సినిమాపై అంచ‌నాలు తారాస్థాయికి చేర్చేసాయి. అంత‌గా అంచ‌నాలు పెట్టుకున్న ఈ సినిమాకు తొలిరోజు దారుణ‌మైన టాక్ వ‌చ్చింది. 2019కి సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ అయిపోయింది. ఈ సినిమాకు మాస్ ఆడియ‌న్స్ పుణ్య‌మా అని భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అంత డిజాస్ట‌ర్ టాక్ తో కూడా 58 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది వినయ విధేయ రామ‌. అయితే లాంగ్ రన్ లేక సినిమా తేలిపోయింది. మ‌రీ ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు బోయ‌పాటి తెర‌కెక్కించిన తీరు చూసి తెలుగు సినిమా స్థాయిని మ‌రో ప‌దేళ్లు వెన‌క్కి తీసుకెళ్లాడంటూ ఆడుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ సినిమాకు బుల్లితెర‌పై మాత్రం అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. తొలిసారి ప్ర‌ద‌ర్శించిన‌పుడు మంచి రేటింగ్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రెండోసారి కూడా అద‌ర‌గొట్టింది. మ‌రో ఛానెల్ లో ధృవ సినిమా వ‌చ్చిన‌పుడే విన‌య విధేయ రామ‌ను కూడా వేసారు. తొలిసారి కంటే రెండో సారి ఇంకా మంచి టిఆర్పీ తీసుకొచ్చింది విన‌య విధేయ రామ‌. దీన్నిబ‌ట్టి సినిమాపై మ‌రి ఎక్కువ‌గా అంచ‌నాలు పెట్టుకుని వ‌చ్చేస‌రికి కాస్త త‌గ్గిపోవ‌డంతో నెగిటివ్ టాక్ వేగంగా వెళ్లిపోయింది. అలా కాకుండా ఉండుంటే క‌చ్చితంగా విన‌య విధేయ రామ మ‌రో స‌రైనోడు అయ్యుండేదేమో..?

More Related Stories