ఆర్ఆర్ఆర్ లో నవదీప్ ...ఇదిగో క్లారిటీ

తెలుగు మీడియాకి, వెబ్ సైట్స్ కి ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గాసిప్స్ గని అయిపొయింది. ఈ సినిమా మీద నెలకొన్న క్రేజ్ తో ఈ సినిమా గురించి ఏమి రాసినా అది వైరల్ అయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ లు లేడీ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, సముద్రఖని లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా దెబ్బకు ఆగిపోయింది. ఇప్పటికే ఒక సరి వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందన్న నమ్మకం అయితే లేదు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం ఏదో హాప్ ఉంది.
ఇక తాజాగా యువ హీరో నవదీప్ తన ట్విటర్ ఖాతాలో కోరమీసాలతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. నవదీప్ ఇలా కోరమీసాలతో కనిపించడంతో నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. దీంతో ఓ వ్యక్తి ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి నవదీప్ సమాధానం ఇచ్చారు. ‘లేదు.. నటించడం లేదు’ అని స్పష్టత ఇచ్చారు. అయితే జనానికి ఈ సందేహం ఎందుకు వచ్చిందో ? అని మీకు అనిపించవచ్చు కానీ చరణ్ లుక్ కి దగ్గరగా ఉండడంతో కొందరు పొరబడి ఉండచ్చు. మొత్తానికి ఆయన ఆర్ఆర్ఆర్ లో లేడని అయితే క్లారిటీ ఒచ్చినట్టియింది.