English   

అఖిల్ కి ఆ యాంకర్ కి ఎఫైరా... అసలు ఏమయింది 

Akhil
2020-04-13 11:09:09

హిట్టు కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్న అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ ఈ మధ్యనే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో హీరోగా ఇది నాలుగవ చిత్రం కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌ మీద బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. పెద్దగా బ్రేక్స్ లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసి గత ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్‌ మేకర్స్ తాపత్రయపడ్డా అది వర్కౌట్ కాలేద. ఇక కరోన దెబ్బకు ఈ సినిమా రిలీజ్ ఎప్పటికి వెళుతుందో కూడా తెలీదు. 

అయితే తాజాగా ఓ టీవీ యాంకర్ అఖిల్ గురించి ఒక రియాలిటీ షోలో కామెంట్ చేసి అందరినీ షాక్ లో పడేసింది. ఆ యాంకర్ ఎవరో కాదు విష్ణు ప్రియ. సుధీర్ తో కలిసి పోవే పోరా అనే ఒక షో చేస్తూ పేరు తెచ్చుకున్న ఈ భామకు యూత్ లో మంచి పేరుంది. అయితే ఈ భామ తాజాగా సుమ క్యాష్ షోలో గెస్ట్ గా పాల్గొనగా, అందులో ముక్కు అవినాష్ స్వయంవరం పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో విష్ణుప్రియను రిజెక్ట్ అంటూ అవినాష్ చేసిన కామెంట్ కు రెస్పాండ్ అవుతూ హమ్మయ్య అఖిల్ నాకోసం వెయిటింగ్ అక్కడ అని అనేసి నాలిక కరుచుకుంది. 

నిజానికి విష్ణుప్రియ హీరోయిన్ గా ట్రై చేసి ఇలా షోలు చేసుకుంటోంది. అయితే ఇలా అఖిల్ గురించి మాట్లాడడం వెనుక ఆమె మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉందని అంటున్నారు. ఈ భామ వెండితెరపై కనపడాలనే ఇలా కాంట్రావర్సీ లేపిందని అంటున్నారు. నిజానికి ఈ భామ అంతకు ముందే అఖిల్ విషయంలో హైలైట్ అయ్యింది. అఖిల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో మారు ఇలా  అఖిల్ విషంగా వార్తల్లోకి ఎక్కింది.

More Related Stories