మహేష్ పేరుని కొడుక్కి పెట్టిన అనిల్

వరుస హిట్లతో అపజయాలే లేని డైరెక్టర్లలో ఒకరిగా ఎదుగుతున్న అనిల్ రావిపూడికి ఈ ఏడాది సంక్రాంతి కి డబుల్ ఫీస్ట్ ఎందుకంటే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ రోజునే అనిల్ భార్య అబ్బాయికి జన్మనిచ్చింది. అలా ఈ ఏడాది డబుల్ ఫీస్ట్ అందుకున్నాడు అనిల్. అయితే తన కుమారుడికి అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేహ్స్ పేరు పెట్టుకున్నాడట. ఈ సినిమాలో అజయ్ కృష్ణ పేరులో ఉన్న అజయ్ ని తీసుకుని డానికి సూర్యాన్ష్ అని యాడ్ చేసి పేరు పెట్టాడట.
ఈ విషయాన్నీ తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ వెల్లడించాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో తన కొడుకు పుట్టడంతోనే ఆ పేరు పెట్టానని అనిల్ రావిపూడి చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అనిల్ డైరెక్షన్లో వచ్చిన ఎఫ్- 2 చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎఫ్- 2 విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్ ప్లాన్ చేసి, ప్రస్తుతం దాని స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ ఎఫెక్ట్ నేపధ్యంలో ఉండనుందని అంటున్నారు.