English   

మరో రెండు సినిమాలు సైన్ చేసిన చిరంజీవి...ఫ్లాప్ డైరెక్టర్స్ తోనే 

Chiranjeevi
2020-04-13 12:15:27

లాక్ డౌన్ టైంలో ఆటోబయోగ్రఫీ రాస్తూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు చిరంజీవి. ఈ సమయంలో సినీ కార్మికులకి అండగా సీసీసీ ఏర్పాటు చేసిన ఆయన దాని ద్వారా కార్మికులని ఆదుకుంటున్నారు. ఇక ఈ ఖాళీ సమయంలో ఆయన ఒక పక్క తన ఆత్మ కధ రాస్తూనే కధలు ఫైనల్ చేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలో లూసిఫర్ రీమేక్ తోపాటు బాబీ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారని తెలుస్తోంది. ఎటూ ఆర్‌ఆర్‌ఆర్ సంక్రాంతి రేసులో ఉండే అవకాశాలు తక్కువ ఉన్న నేపధ్యంలో ఆచార్య సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు చిరంజీవి. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని భావించి ఇప్పటి నుండే వాటిని ఫైనలైజ్ చేస్తున్నాటు చెబుతున్నారు.

మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్‌కు రీమేక్ ని సుకుమార్ తెరకేక్కిస్తారని ప్రచారం జరిగినా అది వర్కౌట్ అయ్యేలాగా లేదు. అయితే దీనికి సాహో ఫేమ్ సుజిత్ కి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ పని కూడా చేయడం మొదలు పెట్టారట. నిజానికి సుకుమార్ ని ఈ సినిమా గురించి సంప్రదించిన మాట వాస్తవమే అని అయితే అది కేవలం సలహా కోసమే అని అంటున్నారు. 

దీంతో తెలుగు వెర్షన్‌కు కొన్ని మార్పులు సూచించాడట సుక్కూ. సుక్కూ చెప్పిన ఆ మార్పుల మీదనే సుజిత్ పని చేస్తున్నాడట. ఇక వెంకీ మామ తో హిట్ కొట్టిన బాబీ కూడా మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను వినిపించాడట, దానికి చిరంజీవి బాగా ఇంప్రెస్స్ అయ్యారట. బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారట. లూసిఫర్‌ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనుండగా, బాబీ సినిమాని ఎవరు నిర్మించనున్నారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.

More Related Stories