English   

ఐదో సారి జంటగా చై శామ్ లు...డైరెక్టర్ ఎవరంటే 

 Samantha Chaitanya
2020-04-13 13:01:30

సినిమా ఇండస్ట్రీలో సమంతకు మంచి పేరు ఉంది. అక్కినేని వారింట కోడలు అయ్యాక దానిని మరింత పెంచుకునే పనిలో పడింది ఈ మలబార్ బ్యూటీ. అక్కినేని వారసుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అయితే పెళ్లి అయ్యాక ఈమె కొన్ని పాత్రలకే పరిమితం కావలసి వస్తోంది. సోషల్ మీడియాలో అయితే గ్లామర్ ఒలక బోస్తోంది కానీ సినిమాల్లో ఆ గ్లామర్ ఒలక బోయలేని పరిస్థితి. అందుకే ఈమె ఎక్కువ సినిమాలు చేయడం లేదు. చేసిన కొన్నిటిలో కూడా ఎంతో డిగ్నిఫయిడ్ రోల్స్ అయితేనే చేస్తోంది. అయితే ఈమె తన భర్తతో కలిసి నటించనుందని అంటున్నారు. 

ఏమాయ చేసావే సినిమా మొదలు వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి అందులో ఆటోనగర్ సూర్య తప్ప తప్ప మిగిలిన మూడు సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇక ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించిన మజిలీ చైతూ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోమారు వీరు కలిసి నటించనున్నారని అంటున్నారు. కొరియన్ రీమేక్ సినిమా ఓ బేబీతో తనకి హిట్ ఇచ్చిన నందిని రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి సమాంత రెడీ అయ్యిందట. ఈ సినిమాలో సమంతకి జోడీగా చైతన్య అయితే బాగుంటుందని అని నందిని రెడ్డి భావించడంతో అతనిని హీరోగా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ మూవీ కూడా ఒక కొరియన్ మూవీకి రీమేక్ గానే తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories