English   

ప‌వ‌న్ వ‌చ్చిన త‌ర్వాత బాక్సాఫీస్ షేక్ అవుతుందంట‌.. 

Pawan Kalyan
2020-04-13 17:18:44

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నార‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాళ్ల క‌ళ్లు చూస్తేనే అర్థ‌మైపోతుంది.. ప‌వ‌న్ సినిమా త్వ‌ర‌గా వ‌స్తే చూడాల‌ని వాళ్లు త‌పించిపోతున్నారు. అజ్ఞాత‌వాసి త‌ర్వాత సినిమా చేయ‌ని ఈయ‌న ఇప్పుడు పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అందులో క్రిష్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ సినిమా గురించి కూడా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు నాగ‌బాబు. ఈ రెండు సినిమాల క‌థ‌లు కూడా త‌న‌కు తెలుసు అని.. అందులో ముఖ్యంగా వ‌కీల్ సాబ్ క‌థ ప‌వ‌న్ మ‌న‌సుకు చాలా చేరువైంద‌ని చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. 

ఈ సినిమా తెలుగు రీమేక్ లో న‌టించాల‌ని ఉంద‌ని ప‌వ‌న్ త‌న‌తో గ‌తంలో కూడా చెప్పాడ‌ని గుర్తు చేసుకున్నాడు నాగ‌బాబు. తెలుగులో ప‌వ‌న్ ఇమేజ్ కు స‌రిపోయేలా క‌థ‌ను మ‌రింత బెట‌ర్ మెంట్ చేసార‌ని చెప్పాడు ఈయ‌న‌. ఇదిలా ఉంటే క్రిష్ సినిమా మొగ‌లాయిల కాలం నాటి క‌థ అని.. అందులో కోహినూర్ వ‌జ్రం కోసం క‌థ న‌డుస్తుంద‌ని హింట్ ఇచ్చాడు నాగ‌బాబు. ఈ క‌థ‌ను క్రిష్ తెర‌కెక్కిస్తున్న తీరు కూడా అద్భుతంగా ఉంద‌ని.. ఈ రెండు సినిమాలు విడుద‌లైన త‌ర్వాత ప‌వ‌న్ క‌చ్చితంగా మ‌రోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడ‌ని చెబుతున్నాడు మెగా బ్ర‌ద‌ర్. ఈయ‌న చెప్పిన అప్ డేట్స్ విన్న త‌ర్వాత అభిమానులు మ‌రింత పండ‌గ చేసుకుంటున్నారు. 2020లో వ‌కీల్ సాబ్.. 2021లో క్రిష్ సినిమా విడుద‌ల కానున్నాయి. 

More Related Stories