నిర్మాతగా మారబోతున్న అగ్ర దర్శకుడు..

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ. రాజమౌళి తర్వాత అంత సక్సెస్ రేట్ మెయింటేన్ చేస్తున్నాడు ఈయన. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలన్నీ హిట్టే. అందులోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్ల ఇమేజ్ కు సరిపోయే విజయాలు అందిస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈయన చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఈ సినిమాకు బ్రేక్ రావడంతో ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ గడుపుతున్నాడు ఈ దర్శకుడు. అయితే ఇప్పుడు ఈయన మరో నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈయన త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతున్నాడు. తనే సొంతంగా ఓ నిర్మాణ సంస్థ మొదలు పెట్టి అందులో చిన్న సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు కొరటాల శివ. దాంతో పాటే తన సినిమాలు కూడా చేసుకుంటాడు ఈయన. అదీ ఇదీ రెండూ చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే చాలా మంది దర్శకులు నిర్మాతలుగాను సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే దారిలో తాను కూడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు కొరటాల. చిరంజీవి సినిమా పూర్తైన తర్వాత తన సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టనున్నాడు ఈ దర్శకుడు. మరి దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన కొరటాల.. నిర్మాతగా ఎలాంటి ఫలితం అందకుంటాడో చూడాలి.