ప్రగతి ఆంటీ.. మీరేంటి మీ ఏజ్ ఏంటి.. ఈ డాన్సులేంటి..

ఇప్పుడు ఇదే అడుగుతున్నారు నెటిజన్లు కూడా. వయసు కూడా మరిచిపోయి డాన్సులు చేస్తుంది ప్రగతి ఆంటీ. అప్పట్లో ఎన్టీఆర్ బాద్షా సినిమాలో 'గుడివాడ ఎళ్లాను.. గుంటూరు పొయ్యాను.. అంటూ రెచ్చిపోయి స్టెప్పులేసింది ప్రగతి. అయితే అది సినిమా కోసమే. కానీ ఇప్పుడు నిజంగానే చిందులేసింది ఈమె. అది కూడా లుంగీ కట్టుకుని.. తొడలు కనిపించేలా రెచ్చిపోయింది ఈ సీనియర్ నటి. ఊర మాస్ స్టెప్స్‌తో అందరినీ అలరించింది. ఆమె డ్యాన్స్ చేసింది ఈ సారి ఎవరి పాటకు అనుకుంటున్నారు.. ఇళయ దళపతి విజయ్ పాటకి. ఆయన నటిస్తున్న 'మాస్టర్' చిత్రంలోని మాస్ పాటకి అదే రేంజ్ లో డాన్సులు చేసి ఔరా అనిపించింది ప్రగతి ఆంటీ. ఈమె డాన్సులు చూసి కొందరు షాక్ అవుతున్నారు.. మరికొందరు మాత్రం ఈ ఏజ్ లో అవసరమా మీకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే సురేఖా వాణి లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూతుళ్లతో కలిసి రెచ్చిపోయి డాన్సులు వేసి చివాట్లు తిన్నారు. ఇప్పుడు ప్రగతి ఆంటీ సోలో స్టెప్పులతో పిచ్చెక్కించింది. ఈమెకు కూడా చివాట్లు తప్పేలా లేవు. పైకి ఏం తెలియనట్లు చాలా అమాయకంగా.. పద్ధతిగా కనిపించే ప్రగతిలో ఈ కోణం కూడా ఉందా.. ఇంత మాస్ టాలెంట్ దాగి ఉందా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.