English   

శింబు, ప్ర‌భుదేవా ల‌తో బ్రేక‌ప్ గురించి ఓపెన్ అయిన న‌య‌న‌తార‌..

nayan
2020-04-14 07:41:38

న‌య‌న‌తార హీరోయిన్ గా ఎంత ఫేమ‌స్ అయిందో.. ఆమె ప్రేమ విష‌యాల నుంచి కూడా అంతే పాపుల‌ర్ అయింది. కెరీర్ మొద‌ట్లోనే త‌మిళ హీరో శింబుతో ప్రేమ‌లో ప‌డింది ఈమె. ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు. కానీ అనుకోకుండా విడిపోయారు. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు శింబు కూడా పెళ్లి చేసుకోలేదు. ఇక ప్ర‌భుదేవాతో కూడా పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది వ్వ‌వ‌హారం. అప్ప‌ట్లో ఈయ‌న కోసం మ‌తం కూడా మార్చుకుంది న‌య‌న‌తార‌. కానీ అది కూడా పెటాకులే అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ప్రేమ‌క‌థ‌ల గురించి ఓపెన్ అయింది న‌య‌న‌తార‌. తొలి రెండు ప్రేమ‌క‌థల గురించి చెప్తూ న‌మ్మ‌కం లేని చోట ప్రేమ నిలవదు.. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిద‌నుకున్నాను.. అందుకే ఆ ఇద్ద‌రితో నా బంధాన్ని కాద‌నుకున్నాను.. క‌ష్ట‌మైనా విడిపోయాను.. వాళ్ల‌తో అనుబంధం తెంచుకున్న తర్వాత నేను ఎంతో క్షోభను అనుభవించానో ఆ దేవుడికే తెలుసంటూ క‌న్నీరు పెట్టుకుంది న‌య‌న‌తార‌. క‌చ్చితంగా ప్రేమ‌లో ఉన్న‌పుడు ఒక‌రినొక‌రు ప్రేమ‌గా చూసుకోవాలి..

ఏదీ దాచుకోకూడ‌దు.. న‌మ్మ‌కంగా ఉండాలి.. కానీ ఆ న‌మ్మ‌కం వాళ్ల‌తో ప్రేమ‌లో ఉన్న‌పుడు క‌నిపించ‌లేద‌ని చెబుతుంది న‌య‌న్. అందుకే పెళ్లి వ‌ర‌కు వ‌చ్చిన వ్య‌వ‌హారం తెగ‌దెంపుల వ‌ర‌కు కూడా వ‌చ్చింది. ప్రభుదేవాతో అయితే మ‌రీ దారుణం.. నేడోరేపో పెళ్లి అన‌గా ఈ ఇద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత క‌నీసం ఆయ‌న పేరు ఎత్త‌డానికి కూడా ఇష్ట‌ప‌డట్లేదు న‌య‌న్. ఆ బ్రేక‌ప్స్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి త‌న‌కు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని చెబుతుంది న‌య‌న‌తార‌. ఆ స‌మ‌యంలో సినిమాలు లేక‌పోతే తాను అస‌లు ఇలా ఉండేదాన్ని కాద‌ని చెబుతుంది ఈమె. సినిమాలే త‌న‌ను నిలబెట్టాయని చెబుతుంది న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈమె ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉంది. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని టాక్ వినిపిస్తుంది కానీ మూడేళ్లుగా ఇదే తంతు. ఈమె జాత‌కంలో పెళ్లి గండం ఉంద‌ని.. అందుకే స‌హ‌జీవ‌నంతోనే స‌రిపెడుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముంద‌నేది తెలియాలి.

More Related Stories