English   

సినిమా థియేటర్స్ కి కొత్త రూల్స్..కష్టమైనా తప్పదు 

 Tollywood
2020-04-14 09:29:50

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అంతకంతకూ పాజిటివ్ కేసులతో పాటు.. మరణాలూ పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రజలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఇష్టానుసారం నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అయితే ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతోంది. అదేంటి అంటే జోన్లు వారీగా విభజించి కొన్ని జోన్స్ వరకే ఈ లాక్ డౌన్ వర్తింపచేయవచ్చనే చర్చ జరుగుతోంది. అలా జరిగితే కేవలం రెడ్ జోన్ లో ఉన్న వారికే లాక్ డౌన్ అమలు ఉంటుంది.  

ఆ విషయం పక్కన పెడితే కరోనా ప్రభావం ప్రపంచంలోని ప్రతీ రంగం మీదా పడింది. ఈ మహమ్మారి దెబ్బ మన దేశం మీద మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా రంగం అయితే పూర్తిగా షట్ డౌన్ అయింది.  అయితే ఒక వేల  కరోనా ప్రభావం తగ్గిన తరువాతయినా జనాలు థియేటర్లకు వస్తారా..? అనేది అనుమానమే. అయితే జనాన్ని థియేటర్లకి రప్పించడానికి యాజమాన్యాలు కొన్ని చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. గతంలో లా కాకుండా ప్రతీ షోకు సగం టికెట్లు మాత్రమే అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. అలా అయితే ప్రేక్షకులకు మధ్య ఒకటి సీటు గ్యాప్ ఒస్తుందని అంటున్నారు.  కలెక్షన్స్ అలాగే మెయిన్ తెయినేన్స్ విషయంలో భారీ దెబ్బ పడినా అంతకు మించి దారి దొరకడం లేదని అంటున్నారు.  
 

More Related Stories