విలన్ పాత్రలో బాలయ్య..క్లారిటీ ఇచ్చారు
_750x409.jpg)
బోయపాటి సినిమాలో బాలయ్య బాబే విలన్ అని ఒక సారి లేదు ఒక లేడీ విలన్ అని ఆమె ఎవరో కాదు భూమిక అని మరో సారి ప్రచారం జరిగింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా లెజెండ్, సింహా సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట బోయపాటి. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రను కూడా బలంగా తీర్చి దిద్దుతున్నాడని బాలయ్యను డీ కొట్టాలంటే అవతల కూడా బాలయ్యే అయ్యుండాలని చెప్పి బాలయ్యనే విలన్ గా ప్లాన్ చేశారని అన్నారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు సినిమా యూనిట్. సినిమా మొదలయిన కొంచెం సేపటి దాకా ఒక పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుంది కాని విలన్ కాదని అంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని ఇక అలాగే ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం భూమికను బోయపాటి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి అసలు విలన్ ఎవరో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు.ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.