English   

మరో బిజినెస్ లోకి మహేష్...నిజమేనా 

 Mahesh Babu
2020-04-14 09:58:06

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన తెలుగు స్టార్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పద్దతిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పటికే మ‌హేష్ బాబు ఒక వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగంలో త‌న స‌త్తా చూపించేలా కృషి చేస్తున్నాడు. ఆ మ‌ధ్య మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేష్ సినిమా నిర్మాణం కూడా చేస్తున్నాడు. 

అయితే ఆయన ఇప్పుడు సొంతగా ఓటీటీ ఒకటి లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకరకంగా ప్రస్తుతం డిజిట‌ల్ స్ట్రీమింగ్ దే హ‌వా న‌డుస్తోంది. టాలీవుడ్ నిర్మాత‌లు కూడా ఈ రంగంలో అవకాశాలు చూస్తున్నారు. ఇప్పటికే మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మైహోమ్ గ్రూప్ కలిసి ఆహా పేరుతో ఓటీటీని ప్రారంభించారు. అది సక్సెస్ అయిందనే చెప్పుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు మేహేష్ కూడా సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నారని అంటున్నారు. నిజానికి అప్పుడెప్పుడో ఏడాది క్రితం మహేష్ నమ్రత కొన్ని వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ ఓటీటీ విషయంలో కూడా నిజం లేదని మ‌హేష్ స‌న్నిహితులు అంటున్నారు.  

More Related Stories