ఆర్ఆర్ఆర్ వాయిదా లేదట...ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే

రాజమౌళికి ఒక చెడ్డ పేరుంది అదేంటంటే ఆయన చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడని, గతంలో ఆయన మాట మీద నిలబడి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన దాఖలాలు తక్కువ కావడంతో జనాలు అలా ఫిక్స్ అవుతుంటారు. అయితే సినిమా క్వాలిటీ తదితరాల విషయంలో ఎక్కడా రాజీ పడని ఆయన అలా లేట్ చేస్తూ ఉంటారు అది వేరే విషయం. ఇక ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలిని మించేలా ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమీకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఉండనుంది. షూటింగ్ ప్రారంభమైన కొత్తలోనే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా మరింత లేట్ అవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. బాహుబలి: ది కంక్లూజన్ రిలీజ్ డేట్ కి అంటే ఏప్రిల్ 28కి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వచ్చని కూడా అన్నారు. అయితే అదేమీ లేదని టీమ్ క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
లాక్డౌన్ మరో రెండు వారాలు పెరగడంతో ఈ వార్తలు రావడం సహజమే నని కానీ ఏప్రిల్ కు సినిమా విడుదల వాయిదా పడ్డట్లే అంటూ జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని యూనిట్ అధికారికంగా స్పందించినట్టు చెబుతున్నారు. నిజానికి షూటింగ్ కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. లాక్ డౌన్ కంటిన్యూగా మూడు నెలలు కొనసాగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా షూట్ అయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ రాజమౌళి చేసేస్తున్నారని కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో ఈ సినిమా జనవరిలో విడుదల అవుతుందని అంటున్నారు.