English   

అయ్యప్పనుమ్ కోషియంను అంత రేట్ పెట్టి కొన్నారా 

 Ayyappanum Koshiyum
2020-04-14 11:46:54

టాలీవుడ్‌ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు.  మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మలయాళంలో అగ్ర హీరో అయిన పృథ్వీరాజ్‌ నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నాడన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరో పాత్ర కోసం ఓ యంగ్ హీరో అవసరం కావడంతో రానా అనే పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాని ఎంతకు కొన్నారనే విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ సినిమాకి కోటి అయిదు లక్షలకు రీమేక్ రైట్స్ బేరం కుదిరిందట. అడ్వాన్స్ గా కొంత మొత్తం కూడా ఇచ్చారట. అయితే ఈ సినిమాని ఉన్నదున్నట్టు దించడానికి అయితే కుదరదు. చాలా మార్పులు చేర్పులతో సినిమాని తెరకేక్కించాల్సి ఉంది. మరి ఈ బాధ్యత ఏ దర్శకుడు అందుకుంటారు అనేది ఆసక్తి కరంగా మారింది.

More Related Stories