English   

అల్లు అర్జున్ పుష్ప నుండి సేతుపతి అవుట్...అందుకేనా

Vijay Sethupathi
2020-04-14 13:15:49

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పుష్ప అనే పేరు అలాగే సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నీ మొన్న బన్నీ పుట్టిన రోజున రిలీజ్ కూడా చేశారు. ఇక ఈ పోస్టర్స్ ప్రేక్షకుల‌లో ఒక రకమైన అంచ‌నా పెంచేశాయి. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. 

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారు. విలన్స్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతున్నా ఒక విషయం అయితే క్లియర్ అదే ఈ సినిమాలో ఒక కీలక పోలీసాఫీసర్ పాత్ర కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు నిన్నటి నుండి ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వివాదాలు లాంటివి అయితే ఏవీ లేవని కేవలం డేట్లు సర్దుబాటు కాకనే ఆయన తప్పుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఆయ‌న స్థానంలో  అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

More Related Stories