English   

విడాకులు తీసుకున్న మ‌రో హీరోయిన్.. 

 Simran Khanna
2020-04-14 13:28:34

సినిమా వాళ్ల బందాల‌కు అస్స‌లు గ్యారెంటీ లేకుండా పోతుంది. కొంద‌రు దశాబ్ధాల త‌ర‌బ‌డి క‌లిసి మెలిసి ఉంటున్నారు. కానీ మ‌రికొంద‌రు మాత్రం చిన్న స‌మ‌స్య‌ల‌కే విడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. స్టార్‌ప్లస్ ఛానెల్‌లో సూపర్ హిట్ అయిన యే రిష్‌తా క్యా కెహ్లాతా హై సీరియల్‌లో న‌టించిన గాయత్రి గోయెంకా పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ సిమ్రన్ ఖన్నా. ఈమె ఇప్పుడు త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇదే విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించింది సిమ్ర‌న్. 

ఇద్ద‌రం స్నేహ పూర్వకంగానే విడిపోతున్నామని.. త‌మ‌ ఇద్దరి మధ్యా ఎలాంటి శత్రుత్వం లేదని క్లారిటీ ఇచ్చింది సిమ్రాన్. తన కుమారుడు వినీత్ కస్టడీ మాత్రం భర్తకే ఇచ్చినట్లు తెలిపిన సిమ్రాన్‌.. తరుచుగా కొడుకుని చూసుకోడానికి మాత్రం వెళ్తాన‌ని చెప్పింది. ప‌రస్ప‌ర అంగీకారంతోనే విడాకులు తీసుకున్న‌ట్లు తెలిపింది ఈమె. కొన్ని అనివార్య కార‌ణాల‌తోనే డైవ‌ర్స్ తీసుకున్న‌ట్లు క్లారిటీ ఇచ్చింది ఈమె. త‌మ ఇద్ద‌రి మ‌న‌సులు వేరు.. మార్గాలు వేరు.. అవి క‌ల‌వ‌లేదు కాబ‌ట్టే విడిపోతున్నామ‌ని చెప్పింది సిమ్రాన్. ఈ ఇద్ద‌రి విడాకుల విష‌యం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. యే రిష్‌తా క్యా కెహ్లాతా హై సీరియల్‌లో గాయత్రి పాత్రలో అలరించిన సిమ్రాన్.. కిస్ దేశ్ మెయి హై మేరా దిల్మా, మాతా కి చౌకి వంటి పలు టీవీ షోలలో కూడా నటించి మెప్పించింది.

More Related Stories