శ్రీయ భర్తకు కరోనా లక్షణాలు.. మొగుడికి దూరంగా..

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా, ఫారెన్ కంట్రీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా కరాళ నృత్యం చేస్తుంది. ఈ సయమంలో హీరోయిన్ శ్రీయ భర్తకు కూడా ఈ కరోనా లక్షణాలు కనిపించాయని వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమే అని ఈ హీరోయిన్ కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం శ్రీయ ఇండియాలో లేదు.. తన భర్తతో పాటు స్పెయిన్లోని బార్సిలోనాలో ఉంది. అక్కడే భర్త ఆండ్రీ కొశ్చీవ్తో కలిసి ఉంటుంది.. కానీ ఒకే రూమ్ లో మాత్రం కాదు.. ఇద్దరూ వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. దానికి కారణం తన భర్తకు పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో ఎందుకైనా మంచిదని వేర్వేరు గదుల్లో నిద్రించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
అసలే ఇప్పుడు స్పెయిన్ లో కరోనా దారుణంగా ఉంది. అక్కడ ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. దాంతో కరోనా లక్షణాలు కనిపంచడంతో భయపడిపోయింది శ్రీయ. మార్చి 13 తమ పెళ్లి రోజు.. కానీ బయటికి వెళ్తే ఒక్క హోటల్, రెస్టారెంట్ కూడా ఓపెన్ లేవని చెప్పుకొచ్చింది ఈమె. దాంతో రిజర్వేషన్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చేసామని.. అప్పుడు పోలీసులు ఆపితే తన తెల్ల జాతీయుడు కావడం.. తను ఇండియన్ కావడంతో భార్యాభర్తలు అని తెలియక వదిలేసారని చెప్పింది శ్రీయ. ఎందుకంటే ఒక్కొక్కరుగా బయటికి వస్తే మాత్రమే వదిలేస్తున్నారు అక్కడి పోలీసులు. ఆండ్రీకి ఈ లక్షణాలు కనిపించగానే భయంగా అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గిపోయాయని చెప్పింది శ్రీయ.